నవ్వు-నవ్వించు



1. డాక్టర్‌:-
సుశీల: నువ్వు పెద్దయ్యాక ఏం చదువుతావు?

రాము: నేను డాక్టర్‌ చదువుతాను. దాని కోసం ఇప్పటి నుంచే జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రాలను నేర్చుకుంటున్నా.

సుశీల: డాక్టర్‌ చదవడానికి జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం పనికి వస్తాయి. మరి, గణిత శాస్త్రమెందుకు?

రాము: బిల్స్‌ రాసివ్వడానికి.
Operating System - తెలంగాణా భాషలో
ఓక వేళ తెలంగాణా భాషలో Operating system ఉంటే ఎట్లా ఉంటుంది??
Microsoft Windows 2000 = గింతంత మెత్త కిటికీల్ రెండువేల్
Search = దెవులాడు
Save = బచాయించు
Save as = గిట్లా బచాయించు
Save All = గన్ని బచాయించు
Help = నన్ను బచాయించు
Find = ఎతుకు
Find Again = మళ్ళా ఎతుకు
Move = సర్కాయించు
Zoom = పెద్దగ చేయ్
Open = తెరువు
Close = ముయ్
New = కొత్తది
Old = పాతది
Replace = మార్చెయ్
Insert = నడిమిట్ల ఎట్టు
Space = జాగ
Backspace = ఎనక జాగ
Run = వురుకు
Print = అచ్చు
Copy = గట్లనే దించు
Cut = కోయ్
Paste = అతికియ్
Paste Special = పెషల్ అతికియ్
Delete = బొందలొ కొట్టు
View = సూడు
Tools = ముట్లు
Toolbar = ముట్ల గొట్టం
Exit = ఇగ వోరి
Mouse = ఎల్క
Click = ఒత్తు
Double Click = మల్ల మల్ల ఒత్తు
Scrollbar = తిప్పుడు గొట్టం
Errors = నీ నోట్ల మన్ను వడా!!
Home = ఇంటికి వో
End = కొనాక్కి 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి