Super Jokes



నన్ను నా పెద్దభార్య అనుమానిస్తుంటుంది
Jokeఒక దొంగ అర్థరాత్రి వంశీ ఇంట్లో దూరాడు. భార్యాభర్తలని బెదిరించి, స్థంభానికి కట్టేసి బీరువాలోని నగలు, నగదు అంతా మూటకట్టి, వాటి లిస్టు తయారుచేశాడు. ఈ కాగితంలో మీరిద్దరూ సంతకం పెట్టండి! అన్నాడు. ఎందుకు? అడిగారా దంపతులు ఏడుపు ముఖంతో...వీటిల్లో నేనేదైనా నా చిన్నింట్లో యిచ్చేశానని నా పెద్ద భార్య అనుమానిస్తుంటుంది అందుకే అన్నాడు దొంగ.
__________________________________________________________
ప్రపంచంలో నీకంటే ఇష్టమైనది మరోటి లేదు!
men & womenకమల, శ్రీనివాస్‌లు కాశీకి వెళ్లి గంగా స్నానం చేసారు. మనకిష్టమయినవి ఇక్కడ వదిలెయ్యాలటండి! చెప్పింది కమల. 

నువ్వెంత చెప్పినా సరే నాకీ ప్రపంచంలో నీకంటే ఇష్టమైనది మరోటి లేదు... అన్నాడు శ్రీనివాస్.
_________________________________________________________

మన పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటాడా...?

Pantuluజ్యోతిష్కుడు : మీరో అమ్మాయిని ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ తప్పక ఫలిస్తుంది" అన్నాడు జ్యోతిష్కుడు.

ప్రేమ్ కుమార్ : "మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోడు అని నాతో మీ అమ్మాయి చెప్పింది. కాని ఇంత సింపుల్‌గా ఒప్పుకుంటారని అనుకోలేదు అయోమయంగా అన్నాడు ప్రేమ్ కుమార్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి