మరికొన్ని మంథని జోక్స్

weighing machine

"ఏమిటి పిన్నిగారు అంతకోపంగా ఉన్నారు?" శ్రామలమ్మను అదిగింది వరమ్మ.
"
ఇవాళ ముచ్చటపది RTC Bus standలో weighing machine ఎక్కి రూపాయి నాణెం వేస్తే.......
ఒక్కసారే ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది" కోపంగా అంది శ్యామలమ్మ.

________________________________________________
అత్తగారింటికి
 అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.
"
చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.
3."పాతికేళ్ళ నుంచీ కవితలు రాస్తున్నానన్నారు కదా. ఇప్పటికి ఎన్ని కవితలు అచ్చు అయ్యాయి" అడిగాడు మురళి.


"ఓ! ఇన్ని!" తల వెంట్రుకలను చూపిస్తూ చెప్పడు కావ్యారావు.




"ఓహో అలాగా... రెండా?" అన్నాడు మురళి
________________________________________________


"సిగ్గులేదటయ్యా 
"సిగ్గులేదటయ్యా నీకు? కూరలు తరుగుతుంటే వేలు తెగిందని సెలవు కావాలంటున్నావా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా" అరిచాడు ఆఫీసర్.


"నిజం సార్.... నిజంగానే వేలు తెగింది" వినయంగా అనాడు రంగారావు


"చాల్చాల్లే నోర్ముయ్....


గత పాతిక సంవత్సరాలుగా కూరలు తరుగుతునాను. ఒక్కసారి కూడా నాకు కనీసం గోరు కూడా తెగలేదు. అండర్ స్టాండ్" ఇంకా పెద్దగా అరిచాడు ఆఫీసర్
________________________________________________


"అయ్యగారూ..


"అయ్యగారూ... మీ ఇంట్లో ఇక నేను పనిచెయ్యను. ప్రతిచిన్నదానికీ అమ్మగారు ఊరికే తిట్టిపోస్తున్నారు" చెప్పాడు నౌకర్.


"అబ్బా.. ఆ మాత్రం మాటపడలేవురా?" సర్ది చెప్పబోయడు యజమాని.


"నాకేం ఖర్మండీ... ఆమే తిట్లన్నీ పడడానికి నేనేమైనా ఆవిడ మొగుడినా?" వెళ్తూ అన్నాడు నౌకర్.

1 కామెంట్‌:

  1. చిన్న-పెద్ద
    "మీరు చూస్తే చాలా చిన్న లాయర్లా ఉన్నారు. నా కేస్ టేకప్ చెయ్యగలరా?" సందేహంగా అడిగాడు క్లయింటు.

    "ఫరవాలేదు. మీ కేసు పూర్తయ్యేనాటికి నేను పెద్ద లాయర్నవుతాను" అభయమిచ్చాడు లాయర్.

    రిప్లయితొలగించండి