పెళ్ళి చూపుల జోక్స్

మన మంథని లో ఒక లావుగా వున్నా పెళ్ళికాని యువకుడు ఒక పెళ్ళికి వచ్చి భోజనం చేస్తున్నాడు. ప్రక్కనే వున్నా ఒక పెద్ద మనిషి ఆ యువకున్ని పిలిచి ....కొడుకా...ఇంత లావున్నావు ఇంకా పెళ్లి కావాలి నీకు ఎట్లా కొడుకా పెళ్లి అవుతుంది ?  .. అని కొంచం లావు తగ్గిచ్చుకో పెళ్లి అవుతుందని ఆ యువకునికి ఉచిత సలహా ఇచ్చింది .
ఆ యువకుడు: అమ్మ…. నేను కావాలనే లావు అవుతున్నాను అని సమాధానం చెప్పాడు .
పెద్దమనిషి :ఆ...అదేంటి అని ఆశ్చర్యం గ మొకం పెట్టింది.
ఆ యువకుడు: అవును నేను లావు కావడానికి రెండు కారనాలున్నై
పెద్దమనిషి :ఏంటి ఆ కారణాలు .....
ఆ యువకుడు ;ఒకటి ....పెళ్లిఐన  తరువాత  వచ్చే బార్య  ఎలా వంట వండుతుందో ? ,ఏమి పెడుతుందో తెలియదు కదా అందుకే ముందు చూపుగా ఎక్కువగా భోజనం లాగిస్తున్న ....(వారం రోజులు తినకున్నా నడుస్తుంది కదా )
పెద్దమనిషి:రెండవది ఏంది కొడుకా ?
ఆ యువకుడు నాకు పెళ్లి చూపులప్పుడునేను సన్నగా కనిపిస్తే ...పిల్ల నిచ్చే మామ వీడే ఏమి తినకుండా సన్నగా వున్నాడు ?రేప్పొద్దున నా బిడ్డకేమీ పెడతాడో అని అనుకుంటాడని  లావవు తున్న నని కొంటెగా సమాధానం చెప్పాడు
ఆ  )

===========================================================================================================================
సంగీతం నేర్చుకున్న ఒక యువతి జోక్స్


మన మంథని లో సంగీతం కాలేజీ లో సంగీతం నేర్చుకున్న ఒక యువతికి పెళ్లి అయింది రోజూ ఆమె ఇంటిలో సంగీత సాధన చేస్తూ వుండేది .ఒక రోజు .....ఆమె భర్త తో
యువతీ ;నాకు మా ఇంట్లో వాళ్ళు చిన్న తనం నుంచే సంగీతం నేర్పిచ్చారు .ఇంతకి నేను పాడే రాగాల్లో మీకు ఎ రాగం ఇష్టం అని ముద్దుగా అడిగింది
భర్త : మౌన రాగం అని టక్కున సమాధానం ఇచ్చాడు 
ఆ ఆ ఆ .........
==================================================================================================

వడదెభ్బ జోక్స్.......

మన మంథని లో ఒక కుటుంబం  లో భర్త మీదికి భార్య చాల పెత్తనం చేస్తూ ఉండేదట... వట్టి  వట్టి గానే భర్త ను కోట్టేదట ……
వారికీ ఒక బడికి పోయే కొడుకు( రాము )వున్నాడు ..ఒక రోజు  బడిలో...
రాము: నిన్న మా నాన్న కి వడదెభ్బ తగిలిందిరా చెప్పాడు రాము బాలుతో
బాలు; పచ్చి అబద్దం . నిన్న అంత మీ నాన్న బయటకి వెళ్లలేదని నాకు తెలుసు చెప్పాడు  రాము ..
బాలు: అక్కడే పప్పులో కాలేశావు వడదెభ్బ అంటే ఎండలో తిరుగుతే వచ్చింది కాదు .. మా అమ్మ తను చేసిన వడలతో మా నాన్న ని కొట్టింది" ఆ ఆ ఆ ..
============================================================================================================================

ప్రభు ; (భార్యతో అంటున్నాడు): దేవుడు నీకు రెండు కళ్ళు ఇచ్చాడుగా అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా?
మణెమ్మ ;(భర్తతో): దేవుడు మీకు కూడా 32 పళ్ళు ఇచ్చాడుగా . ఆ మాత్రం నమలలేరా.........!


1 కామెంట్‌: